పలాసలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 29వ వార్డులో స్థానిక కౌన్సెలర్ జోగ త్రివేణి మల్లితో కలిసి ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం ఉదయం పింఛన్లు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. వికలాంగ పింఛన్లు ఎవరికి నిలుపుదల చేయలేదని, ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు.