రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి

SRD: జహీరాబాద్‌లోని అండర్ బ్రిడ్జి వద్ద రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. జహీరాబాద్‌కు చెందిన జాఫర్ మియా (55) రైల్వే పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీ కొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.