రైల్వే ఉద్యోగుల కోసం రంగోలీ పోటీ

VSP: విశాఖ వాల్తేరు రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో 'హర్ ఘర్ తిరంగా' ప్రచారం గురువారం నిర్వహించారు. డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా మార్గదర్శకత్వంలో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా విశాఖ రైల్ క్లబ్‌లో గురువారం మహిళా ఉద్యోగుల కోసం రంగోలీ పోటీ నిర్వహించారు.