'అభివృద్ధి చేయకపోతే సంవత్సరంలో రాజీనామా'
KNR: గ్రామాన్ని అభివృద్ధి చేయకపోతే సంవత్సరంలో రాజీనామా చేస్తానని బాండ్ పేపర్‌పై రాసిచ్చిన వైనం శంకరపట్నంలో చోటు చేసుకుంది. మండలంలోని కేశవపట్నంలో సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిన అభ్యర్థి సముద్రాల సంపత్ గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యలను తీర్చుతానని లేదంటే రాజీనామా చేస్తానని హామీ ఇచ్చాడు. కోతుల సమస్య, ఆటో యూనియన్ సంఘం భవన నిర్మాణం వంటి హామీలను ప్రకటించాడు.