వినూత్న రీతిలో నిరసన చేపట్టిన యువకులు

వినూత్న రీతిలో నిరసన చేపట్టిన యువకులు

KMM: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముదిగొండలో ఇవాళ యువకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గ్రామంలో తీవ్రంగా ఉన్న కోతులు, కుక్కల బెడదను నివారించే అభ్యర్థికే తమ ఓటు వేస్తామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ సామాజిక సమస్యను పరిష్కరించడానికి ఎవరైతే స్పష్టమైన హామీ ఇస్తారో వారినే గెలిపిస్తామని యువకులు స్పష్టం చేశారు.