భారీగా అక్రమ ఇసుక డంప్ సీజ్
SRD: హత్నూర్ మండలం పన్యాల గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను మంగళవారం రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సీజ్ చేశారు. సుమారు 150 లారీల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొందరు మంజీరా తీరంలో తవ్వకాలు చేసి ట్రాక్టర్లలో ఇసుక తరలించి నిల్వ చేస్తున్నారని చెప్పారు. సీజ్ చేసిన ఇసుక విలువ రూ.40 లక్షలు ఉంటుందిని వెల్లడించారు.