సీతారాం ఏచూరికి ఘన నివాళి

SRCL: జిల్లా కేంద్రంలోని అమృత్ లాల్ శుక్లా కార్మిక భవనంలో సీపీఎం ఆధ్వర్యంలో సీపీఎం అగ్రనాయకుడు సీతా రాం ఏచూరి ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. సీతారాం ఏచూరి చిత్రపటానికి నాయకులు పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడారు. భారత రాజకీయ రంగంలో కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు యోధుల్లో సీతారాం ఏచూరి ఒకరని అన్నారు.