త్వరలో సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ ప్రారంభం
HYD: సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్‌ను జూన్ 2న ప్రారంభిస్తామని మంత్రి రాజనర్సింహ తెలిపారు. ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్ లో ఆయన మాట్లాడుతూ.. 100 పడకలతో అత్యంత ఆధునికంగా నిర్మించే ఈ ఆసుపత్రిలో ప్రత్యేకంగా 50 పడకలను విదేశీయులకు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. కొత్తపేట, అల్వాల్ టిమ్స్ హాస్పిటల్స్ లోనూ ఇలాగే విదేశీయుల కోసం 50 చొప్పున బెడ్స్ కేటాయిస్తామన్నారు.