డోలు వాయించి కళాకారులను ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే
BDK: ఐటీడీఏ గిరిజన భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదివాసీ కళాకారుల డోలు వాయిద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి ప్రదర్శనను ఆస్వాదించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్వయంగా డోలు మోగించి కళాకారులతో కలిశారు. సంప్రదాయ కళలకు ప్రోత్సాహం అవసరమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.