'ఏనుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
PPM: లక్ష్మీనారాయణ పురం గ్రామ పరిసర ప్రాంతాలలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. రైతులు, గ్రామస్థుల ఎవరైనా పంట పొలాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగుల గుంపు ఈ ప్రాంతంలోనే సంచారిస్తున్నాయని తెలుసుకొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించాలని కోరారు.