కర్నూలులో వ్యాపారుల ఆస్తిపన్ను చెల్లింపు
కర్నూలులో మూడు వాణిజ్య దుకాణాల యజమానులు రూ.10,64,111 విలువైన ఆస్తిపన్ను చెక్కులను సోమవారం కమిషనర్ పి. విశ్వనాథ్‌కు అందజేశారు. పన్నులు సమయానికి చెల్లించడం నగర అభివృద్ధికి తోడ్పడుతుందని కమిషనర్ అభినందించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఆరి జునైద్ ఉన్నారు.