సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం మున్సిపల్ ఛైర్మన్ బృంగి రత్నమాల భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మున్సిపాలిటీలోని అన్ని వార్డులలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ షానవాజ్ పాల్గొన్నారు.