గుర్తుతెలియని మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

KKD: ఉప్పాడ హార్బర్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని యు కొత్తపల్లి మండల ఎస్సై వెంకటేష్ శుక్రవారం తెలిపారు. మృతి చెందిన వ్యక్తి రాళ్ల మధ్యలో ఇరుక్కుపోవడంతో మొహం రాపిడికి చర్మం ఊడిపోయింది. ఇతను నలుపు రంగు షర్టు, బ్లూ కలర్ గల లుంగి ధరించాడు. మృతి చెందిన వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే నంబర్ 9440900752కు సమాచారం అందించాలన్నారు.