'కల్తీ విత్తనాలు విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలి'
ELR: పోలవరంలోని పలు గ్రామాల్లో కల్తీ మొక్కజొన్న విత్తనాల వల్ల పంట నష్టపోయిన పొలాలను AO రాంబాబు సోమవారం పరిశీలించారు. ఈ రబీ సీజన్‌లో విత్తనాలు వేసినా ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అధికారుల పరిశీలన అనంతరం, బాధితులు తహసీల్దార్ సాయిరాజును కలిసి ఫిర్యాదు చేశారు. కల్తీ విత్తనాలు విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.