మున్సిపల్ అభ్యర్థుల సన్నాహక సమావేశం
MHBD: జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొని, ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి చేరవేయాలని, అభ్యర్థులకు నియామకాలు, ప్రచార విధానాలు, పార్టీ మార్గదర్శకాలు వివరించారు.