‘సబర్మతి కోసం 10 వేల మంది తరలింపు నిజమే’

‘సబర్మతి కోసం 10 వేల మంది తరలింపు నిజమే’

TG: అహ్మదాబాద్‌లోని సబర్మతి నది ప్రక్షాళన కోసం 22KM పరిధిలో 10 వేల మందిని తరలించినట్లు అక్కడి అధికారులే తెలిపారని మంత్రి శ్రీహరి, ఎంపీ చామల కిరణ్‌ వెల్లడించారు. సబర్మతికి నర్మదా నీటిని ఇచ్చినట్లే, మూసీకి గోదావరి నీటిని తేవాలని సీఎం రేవంత్ ప్రయత్నిస్తుంటే BJP, BRS అడ్డుపడుతున్నాయని విమర్శించారు. నగర అభివృద్ధి కోసం మూసీ ప్రక్షాళన జరిగి తీరాలని వారు స్పష్టం చేశారు.