పాలిసెట్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

పాలిసెట్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

MDCL: రేపు జరిగే పాలిసెట్‌ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ అరుంధతి తెలిపారు. మేడ్చల్‌లోని గిర్మాపూర్ పాలిటెక్నిక్ కళాశాల, స్ఫూర్తి, ఎన్ఎస్ఆర్ జూనియర్ కళాశాల, హైటెక్, హైటెక్ మోడ్రన్, ఎస్ఎసీ, ఆక్స్‌ఫర్డ్, ఢిల్లీ వరల్డ్ పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉ.11గం. నుంచి మ.1:30 వరకు పరీక్ష జరగనుంది.