తల్లి పాలు బిడ్డకు ఎంతో శ్రేష్టమైనవి

తల్లి పాలు బిడ్డకు ఎంతో శ్రేష్టమైనవి

SRPT: తల్లి పాలు బిడ్డకు ఎంతో శ్రేష్టమైనవి అని అంగన్వాడి టీచర్లు రమాదేవి, మంజుల అన్నారు. బుధవారం నాగారం మండలం పసునూరు అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించి మాట్లాడారు. పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రుపాలు అందించాలని, ముర్రుపాలల్లో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాస్, టీచర్లు, సెక్రెటరీ పాల్గొన్నారు.