ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

SRCL: అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను వేములవాడలో సోమవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సెస్ మాజీ ఛైర్మన్ అల్లాడి రమేష్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సిద్ధంశెట్టి వేణు, నాయకులు చీకోటి శ్రీహరి, కట్కూరి శ్రీనివాస్, నగుబోతు రవీందర్, కొత్త అనిల్ కుమార్, కట్కం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.