గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు

NRML: ఎగువన కురిసిన వర్షాలకు భైంసాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరింది. గడిచిన 24 గంటల్లో 540 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 357.30 మీటర్లుగా ఉంది.