కాంగ్రెస్ గూండాల దాడిని ఖండించిన సబితా ఇంద్రారెడ్డి
RR: గజ్వేల్ క్యాంపు ఆఫీస్‌పై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా రేవంత్ సర్కార్ నిరంతరం అరాచకాలకు పాల్పడుతోంది. చట్టం, శాంతి భద్రతలపై నిర్లక్ష్యం కారణంగా ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ పరిస్థితులను చూసి తెలంగాణ తల్లి సైతం కన్నీళ్లు పెట్టుకుంటోందన్నారు.