నగరంలో కలుషిత నీరు..!
హైదరాబాద్: నాగోల్ పరిధిలోని శ్రీలక్ష్మీ నగర్, శ్రీనివాస్ నగర్, విశాలాంధ్ర కాలనీల్లో కలుషిత తాగునీరు కలకలం రేపుతోంది. ఈ నీరు తాగిన పలువురు స్థానికులు అస్వస్థతకు గురై అనారోగ్యం బారిన పడ్డారు. పైప్‌లైన్ లీకేజీ కారణంగా మురుగునీరు కలిసినట్లు సమాచారం అందడంతో జలమండలి అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. సమస్యను పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు.