పొదుపు సంఘ సభ్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం

KNR: తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామంలో చాణక్య పురుషుల పొదుపు సంఘం సభ్యుడు కిన్నెర సతీష్ ఇటీవల మరణించారు. అతని తల్లి కిన్నెర లక్ష్మికి సంఘం నుండి సామూహిక నిది రూ. 84,816 ఆర్థిక సహాయాన్ని సంఘం అధ్యక్షుడు మాదన వీరయ్య శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, మృతుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.