'మున్సిపాలిటీ ఉద్యానవన అభివృద్ధికి నిధులు'
MDCL: జిల్లా పరిధిలో ఉద్యానవన అభివృద్ధి కోసం HMDA నిధులు మంజూరు చేసినట్లుగా అధికారులు తెలిపారు. మేడ్చల్ పురపాలికలో 23 వార్డులు ఉండగా రూ.98.4 లక్షల నిధులు కేటాయించింది. పురపాలక పరిధిలో 5 పార్కులను అభివృద్ధి చేస్తామని, అభివృద్ధికి చెరువుల సుందరీకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లుగా తెలిపారు.