రేపు అంతర్వేది ఆలయం మూసివేత

రేపు అంతర్వేది ఆలయం మూసివేత

కోనసీమ: అంతర్వేది గ్రామంలో వేంచేసిన స్వయంభూ శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో ఆదివారం చంద్రగ్రహణం కారణంగా ఆలయం మూసి వేయబడుతుందని ఆలయ ఈవో ప్రసాద్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 1:00 గంటల నుంచి దర్శనాలు నిలిపివేస్తామన్నారు. తిరిగి సోమవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనతరం 8 గంటల నుంచి దర్శనాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ వషయాన్ని భక్తులు గమనించాలని ఆయన సూచించారు.