అయిజలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

గద్వాల్: అయిజలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు.. కొత్తబస్టాండు వద్ద కూరగాయలు అమ్మబోయే నరసింహులు రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ రైడర్‌తో పాటు నరసింహులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం కర్నూల్లో ఓ హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.