సర్పంచ్‌ మేడ బాబుకు ఘన సన్మానం

సర్పంచ్‌ మేడ బాబుకు ఘన సన్మానం

GNTR: ఫిరంగిపురం సర్పంచ్‌గా సేవలందించిన మేడ బాబు పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం ఫిరంగిపురం పంచాయతీ కార్యాలయంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి, మేడ బాబును శాలువా, పూలమాలలతో సత్కరించి ఆయన సేవలను కొనియాడారు. భవిష్యత్తులోనూ ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.