'వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం'
BDK: కొత్తగూడెం కార్పొరేషన్ 8వ డివిజన్లోని శ్రీనివాస కాలనీలో శ్రీ కనకదుర్గ కాస్టింగ్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ లింగమర్ల క్రిష్ణారావు ఆధ్వర్యంలో ఇవాళ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ చలివేంద్రం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, వేసవికాలంలో ప్రజలకు దాహార్తిని తీర్చడం కోసం తాగునీటి సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు.