VIDEO: అక్రమంగా తరలిస్తున్న 10 కిలోల గంజాయి పట్టివేత

JN: తరిగొప్పులలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా కనిపించడంతో పట్టుకొని విచారించగా ఒరిస్సా నుండి తరిగొప్పులకు గంజాయి రవాణాకు పాల్పడుతున్నట్లు నిర్ధారణ కావడంతో నిందితుడిని తనిఖీ చేసి 10 కిలోల స్వాధీనం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.