కల్లూరులో బీఆర్ఎస్ గెలుపు
KMM: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా కల్లూరు పట్టణంలోని 12వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఈ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ ఇస్మాయిల్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిపై 99 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. లెక్కింపు ప్రారంభం నుంచే ఇస్మాయిల్ ఆధిక్యం కనబరచగా, తుది ఫలితం వెలువడగానే బీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.