తాండ్ర రిజర్వాయర్‌లో తగ్గని నీటిమట్టం

AKP: నాతవరం మండలం తాండవ జలాశయం నుంచి రైతులకు సాగునీటిని విడుదల చేస్తున్నా.. నీటిమట్టం ఏమాత్రం తగ్గలేదు. ఆగస్టు 10వ తేదీ నుంచి రోజుకు 500 క్యూసెక్కుల నీటిని ఆయకట్టు భూములకు విడుదల చేస్తున్నారు. ఆ సమయానికి 372 అడుగుల నీటిమట్టం ఉండేది. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండడంతో సోమవారం సాయంత్రానికి నీటిమట్టం 357.5 అడుగులు ఉంది.