VIDEO: శిరసనగండ్ల జాతరకు పోటెత్తిన భక్తజనం
NGKL: చారకొండ మండలంలోని శిరసనగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి జాతర ఉత్సవాలు అంబరాన్నంటాయి. జాతరలో ప్రధాన ఘట్టమైన రథోత్సవం మంగళవారం అత్యంత కోలాహలంగా సాగింది. రథాన్ని లాగేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఎటు చూసినా జనసంద్రంగా మారింది.