కూల్ డ్రింక్ బాటిల్లో విషం.. చిన్నారి మృతి

WNP: అమరచింతా పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. వంశీ, గాయత్రి దంపతుల కూతురు హద్విక 18 నెలల పాప పక్కింట్లో ఆడుకుంటూ కూల్ డ్రింక్ బాటిల్లో ఉన్న ద్రవాన్ని తాగింది. ద్రవం తాగిన వెంటనే పాప నోట్లో నుంచి నురుగు రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. తరలిస్తున్న క్రమంలోనే పాప నురుగు కక్కుతూ మార్గమధ్యలోనే మృతి చెందింది.