BREAKING: ఢిల్లీలో భారీ పేలుడు
ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర కారులో భారీ పేలుడు సంభవించింది. గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన కారులో పేలుడు జరగడంతో ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏడు ఫైరింజన్లు మంటలార్పుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.