బాల త్రిపుర సుందరిదేవిగా మాలే గంగమ్మ
KDP: పులివెందుల దసరా ఉత్సవాలలో భాగంగా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోని మాలే గంగమ్మ ఆలయంలో అమ్మవారు బాలత్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని కాయ, కర్పూరాలు సమర్పించారు.