చెరువులో పడి బాలుడు మృతి

చెరువులో పడి బాలుడు మృతి

MBNR: మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాలు.. నాయకమ్మ చెరువులో ఆరో తరగతి చదివే బాలుడు మంగలి ఆంజనేయులు కాలు జారి పడిపోయాడు. గ్రామస్తులు వెంటనే స్పందించి బాలుడిని బయటకు తీసినా అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.