ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్‌కు వినతిపత్రం అందజేత
WNP: గత కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగం ఉన్న వనపర్తి పాత బస్టాండ్‌ను తాత్కాలికంగా వినియోగంలోకి తెచ్చారు. పాత బస్టాండ్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని సీపీఎం పార్టీ నాయకులు మంగళవారం ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్‌కు శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. సీపీఎం నాయకులు మాట్లాడుతూ.. డ్రైనేజీ, ప్లాట్ ఫామ్‌లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.