త్రిష సినిమాలకు గుడ్ బై.. క్లారిటీ
స్టార్ హీరోయిన్ త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పనుందనే వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై దర్శకుడు చిత్ర లక్ష్మణన్ స్పందిస్తూ.. త్రిష ఇకపై నటించాలని అనుకోవడం లేదని, కొత్త అవకాశాలను కూడా తిరస్కరిస్తున్నట్లు కొందరు నిర్మాతలు తెలిపారని పేర్కొన్నాడు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, త్రిష టీమ్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.