పెన్నా నదిలో శవమై తేలిన విద్యార్థి
NLR: నెల్లూరు దెయ్యాలదిబ్బ కాలనీ వద్ద పెన్నా నది ఒడ్డున ఓ గుర్తు తెలియని యువకుడు శవమై తేలాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన వ్యక్తి గంగవరంలోని గీతాంజలి కళాశాలలో చదువుతున్న హర్షవర్ధన్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.