'రహదారులపై ధాన్యం ఆరబోయద్దు'
NZB: బోధన్ మండలంలోని ప్రధాన రహదారులపై వడ్లు ఆరబోయడం ప్రమాదాలకు కారణమవుతోందని అధికారులు హెచ్చరించారు. ఇటీవల ధాన్యం కుప్పల వల్ల వాహనాలు జారి ప్రమాదాలు జరిగినట్లు తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇవి కనిపించక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతులు రహదారులకు బదులుగా ఖాళీ ప్రదేశాల్లోనే ధాన్యాన్ని ఆరబోసుకోవాలన్నారు.