కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ASR: తల్లి బిడ్డల ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.సుందరరావు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ఎక్స్‌ప్రెస్ వాహన కార్మికులతో కలిసి పాడేరు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. వాహనాల డ్రైవర్ల వేతనం రూ.18,500 చెల్లించాలని కోరారు. చట్ట ప్రకారం వీక్లీ ఆఫ్‌లు, పండుగలు, జాతీయ సెలవులు అమలు చేయాలన్నారు.