ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని పూర్తి చేయాలి: కలెక్టర్
సూర్యాపేట: జిల్లాలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. 3,000 ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 868 ఎకరాల్లోనే సాగు జరిగిందన్నారు. మిగిలిన విస్తీర్ణాన్ని ఈ నెలఖరులోగా పూర్తి చేయాలన్నారు. అనంతరం యూరియా కొత్త యాప్‌ను ఆయన ప్రారంభించారు.