పాములు, మొసళ్లతో సరిహద్దు గస్తీ..?
బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు, నేరాలను అరికట్టేందుకు భారత్ అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో బంగ్లా సరిహద్దు జలాల్లో మొసళ్లు, పాములను వదలాలనే ప్రతిపాదన ఎంత వరకు సాధ్యమో పరిశీలించాలని ప్రాంతీయ కేంద్రాలకు BSF ఆదేశించినట్లు సమాచారం. అయితే, ఈ ఆలోచన పరిశీలన దశలోనే ఉందని, ఇంకా అమలు కాలేదని తెలుస్తోంది. ఇందులో ఎన్నో సవాళ్లు ఉన్నాయని అధికారిక వర్గాలు చెప్పినట్లు టాక్.