విజయనగరం యువకుడికి జీవిత ఖైదు

విజయనగరం యువకుడికి జీవిత ఖైదు

విజయనగరం పట్టణంలోని గాజులరేగకు చెందిన కర్నపు సాయి (20) తన తండ్రిని హత్య చేసిన కేసులో జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించిందని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. తండ్రి పేరుతో ఉన్న ఇల్లు తనకు ఇవ్వాలని కోరగా నిరాకరించడంతో 2025 ఫిబ్రవరి 13న మద్యం మత్తులో తండ్రిని గుద్దుతూ, తన్నడంతో అతడు మృతి చెందాడు. ఈ కేసు విచారణలో నేరం రుజువుకావడంతో శిక్ష విధించారు.