గంజాయి రవాణా కేసులో నిందితులకు 10 ఏళ్లు జైలు శిక్ష

గంజాయి రవాణా కేసులో నిందితులకు 10 ఏళ్లు జైలు శిక్ష

SKLM: చిలకపాలెం టోల్ ప్లాజా వద్ద అక్రమంగా గంజాయి రవాణా చేసిన ఇద్దరు వ్యక్తులకు జిల్లా కోర్టు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ భాస్కరరావు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కేసు విచారణ అనంతరం కోర్టు ఈ తీర్పు వెలువరించిందని ఎస్పీ తెలిపారు.