ఈనెల 19న హిందూ సమ్మేళనం
JGL: మల్యాల మండల కేంద్రంలోని స్థానిక అంగడి బజార్ వద్ద ఈనెల 19న సుమారు 2 వేల మందితో భారీ ఎత్తున హిందూ సమ్మేళన ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హిందూ సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కల్పించడంతోపాటు, అన్ని వర్గాల హిందువులను ఒకే వేదికపై తెచ్చి, హిందూ సమాజమంతా ఐక్యంగా ముందుకు సాగాలనే సంకల్పంతో నిర్వహిస్తున్నామన్నారు.