భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ

KMM: జిల్లాలో భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సునీల్ దత్ అన్నారు. చెరువులు, కుంటల వద్ద నీటి ఉధృతిని దృష్టిలో ఉంచుకొని వంతెనలు, చప్టలపై బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాల భారీన పడకుండా వాహనాల రాకపోకలను నిషేధించాలని అధికారులను సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కు, పోలీస్ కంట్రోల్ సెల్ నెం. 8712659111కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.