'దళారులను ఆశ్రయించి మోసపోవద్దు'

'దళారులను ఆశ్రయించి మోసపోవద్దు'

RR: యాచారం మండలంలోని నందివనపర్తి, చింతపట్ల, యాచారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఈరోజు ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ ఛైర్మన్ గురునాథ్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు.