'మేడారంపై రాజకీయాలు చేస్తే నాశనమవుతారు'
TG: చిత్తశుద్ధితో మేడారం అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. మేడారం అభివృద్ధిపై రాజకీయాలు చేస్తే నాశనమవుతారని మండిపడ్డారు. అభివృద్ధి విషయంలో చిల్లర రాజకీయాలు చేయొద్దన్నారు. ఆదివాసీల అస్తిత్వం దెబ్బతినకుండా నిర్మాణాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మేడారం అభివృద్ధిపై ఎవరి సూచనలైనా స్వీకరిస్తామని వెల్లడించారు.