రూ.5లక్షలు విలువ చేసే ఎరువులు సీజ్

రూ.5లక్షలు విలువ చేసే ఎరువులు సీజ్

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని ఎరువుల దుకాణాలను ఏడీఏ షేక్ బైనుల్లాబిన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఐదు దుకాణాలలో ఎటువంటి పత్రాలు లేని భవనాలలో విక్రయిస్తున్న సుమారు రూ.5 లక్షలు విలువచేసే ఎరువులను సీజ్ చేసినట్లు ఏడీఏ వెల్లడించారు. ఈ మేరకు రైతులకు విక్రయించే ఎరువులు, క్రిమి సంహారక మందులకు రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటాము.